సీమాంధ్ర సారధి, ఫిబ్రవరి 10: ‘‘విష్ణు వల్లభ ఫ్యూయల్ స్టేషన్ – భారత్ పెట్రోల్ పంపు’’ వార్షికోస్తవం సందర్భంగా మేడపి టోల్ గేట్ దగ్గర ఉన్న పెట్రోల్ బంకు (గణపవరం) వద్ద ఈ నెల 12వ తేదీ (గురువారం) ఉచిత కంటి వైద్య శిబిరo(Free Eye camp) నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది.

డాక్టర్ రామలింగారెడ్డి మాక్స్ విజన్ ఐ హాస్పిటల్, నరసరావుపేట వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని త్రిపురాంతకం పరిసర ప్రాంత గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విష్ణు వల్లభ ఫ్యూయల్ స్టేషన్ అధినేత బోదనపు అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ, హెల్త్ కార్డు ఉన్న వారికి అన్ని రకాల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తారని పేర్కొన్నారు. కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకునే వారికి ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
FOR GOOGLE LOCATION CLICK ON THE BELOW PHOTO

