ఫైల్ ఫొటో
- అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్లు ప్రారంభం!
సీమాంధ్ర సారధి(ఎడ్యుకేషన్): పేద పిల్లల చదువుకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డా. బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల(Gurukulam) పాఠశాలలు అడ్మిషన్లకు ఆహ్వానం పలుకుతున్నాయి.
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఐదో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం వంటి అన్ని సదుపాయాలు అందిస్తారు. ప్రతిభకు కొదవలేకుండా, ఆర్థిక అడ్డంకులు చదువుకు అడ్డుగా నిలవకూడదనే ఉద్దేశంతో ఈ గురుకులాలు పనిచేస్తున్నాయి. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 19లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 డా.బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి.
ఎక్కడెక్కడ ఉన్నాయి..
కర్నూలు జిల్లాలోని అరి కెర, సి.బెళగల్, చిన్నటేకూరు, నంద్యాల జిల్లాలో జూపాడుబంగ్లా, డోన్ ప్రాంతాల్లో బాలుర ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో డోన్, ఆళ్లగడ్డ రెగ్యులర్, ఆళ్లగడ్డ ఆర్ పీఆర్పీఆర్, కోవెలకుంట్ల, నంద్యాల జిల్లాలో కంబాల పాడు, వెల్దుర్తి, దిన్నెదేవరపాడు, లక్ష్మాపురం, ఆరేకల్ ప్రాంతాల్లో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 8 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చిన్నటేకూరులో బాలుర ఎస్సీ గురుకుల కళాశాలలో జేఈఈ, నీట్ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఐదో తరగతిలో మొత్తం 1,120 సీట్లు ఉన్నాయి. డోన్‌లోని డా. బి.ఆర్. అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో తొమ్మిదో తర గతి వరకు ఉంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తం 1,240సీట్లు ఉన్నాయి.
ఎవరు అర్హులు..
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులు. దీంతో పాటు 6 నుంచి 10వ తరగతి వరకు బ్యాక్లాగ్ (మిగిలిన సీట్లు) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
వయస్సు:
ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థి వయస్సు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 31.08.2026 నాటికి 13 ఏళ్లు, ఇంటర్మీడియట్‌కు 19 ఏళ్లు ఉండాలి. బీసీ, ఇతర వర్గాల వారికి ఐదో తరగతికి 11 ఏళ్లు, ఇంటర్మీడియట్‌కు 17 ఏళ్ల లోపు ఉండాలి.
కావాల్సిన ధ్రువపత్రాలు:
విద్యార్థి విద్యార్హత, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డు కలిగి ఉండాలి. దర ఖాస్తు ఫీజు రూ.100.
ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ జాబితా ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది.
రిజర్వేషన్(శాతాల్లో):
ఎస్సీ 75, ఎస్టీ 6, బీసీ-సి 11, బీసీ 5, ఓసీ 3. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించకూడదు. ప్రవేశ పరీక్ష తేది: మార్చి 1న
నిర్వహిస్తారు. వెబ్సైట్ అడ్రస్: https://apbragcet.apcfss.in
