సీమాంధ్ర సారధి(లీగల్): వెట్టి చాకిరి నిర్మూలన చట్టంపై అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవి. శేషసాయి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.ఆర్.కె కృపాసాగర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఏ.పీ.జి. విజయలక్ష్మి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.ఎస్.వి హిమబిందు, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధి కమాండర్ అశోక్ కుమార్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల డిప్యూటీ సెక్రటరీ హెచ్ రంగేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ బోర్డ్ స్టేట్ డైరెక్టర్ లావణ్య వేణి, లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గణేషన్, చీఫ్ కమిషనర్ అఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చేతన్ హాజరయ్యారు. వెట్టిచాకిరీ బాధితుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్ రాయపాటి శ్రీనివాస్, మధుసూదన్, ప్యానల్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్ పాల్గొన్నారు.
