పింఛన్ అందజేస్తున్న పార్వతమ్మ
- ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీని పర్యవేక్షించిన కమ్మరి పార్వతమ్మ..
సీమాంధ్ర సారధి(కర్నూలు): పేదల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల లబ్ధిదారులందరికి పారదర్శకంగా అందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ పేర్కొన్నారు. శనివారం కర్నూలు(Kurnool) జిల్లా కేంద్రం 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేశారు.

గతంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత టీడీపీ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరవుతాయని చెప్పారు.
అనంతరం లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. సచివాలయ సిబ్బంది పనితీరు ఎలా ఉంది? ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ అందుతుందా? పంపిణీలో ఏమైనా సమస్యలున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన 31 నామినేటెడ్ పదవులలో భాగంగా ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నంద్యాల పార్లమెంట్ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కమ్మరి పార్వతి ఎన్నికయిన విషయం తెలిసిందే.
కార్యక్రమంలో 37వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర, సీనియర్ కార్యకర్త ఇమ్మానుయేలు, బూత్ ఇన్చార్జిలు వెంకటేష్, బాలకృష్ణ పాల్గొన్నారు.
