సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, ఫిబ్రవరి 23: కర్నూలు ప్రభుత్వాసుత్రిలోని దిశ వన్ స్టాప్ కేంద్రం, మహిళా ప్రాంగణాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి.లీలా వెంకట శేషాద్రి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని సూచించారు. రిజిస్టర్లలో సంతకాలు లేని వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే భోజన వసతి సదుపాయాలను ఆరా తీశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురయితే ఫ్రీ లీగల్ ఎయిడ్ టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

