సీమాంధ్ర సారధి(కర్నూలు) జనవరి 31: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు సి.క్యాంపులోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ లో మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడారు. దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సైనికులు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామన్నారు. కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించామని, ఇందులో న్యాయవాది, ప్యారా లీగల్ వలంటీర్ ఉంటారని తెలిపారు. మాజీ సైనికులంతా ఉచిత న్యాయ సహాయానికి అర్హులని పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్.ఆర్. రత్న రూత్, న్యాయవాది విజయ, ప్యారా లీగల్ వలంటీర్ మధు సుధన్, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు.
