వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న జిల్లా జడ్జి జి.కబర్ధి
సీమాంధ్ర సారధి(లీగల్): జాతీయ లోక్ అదాలత్ను మార్చి 14వ తేదీ జిల్లాలోని కోర్టులలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ కేసులు, రాజీకి అవకాశం ఉండే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకోవాలని జడ్జీలకు సూచించారు. ముఖ్యంగా పదేళ్లకుపైగా ఉన్న పెండింగ్లో ఉన్న సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు.
