ప్రసంగిస్తున్న లీలా వెంకట శేషాద్రి
సీమాంధ్ర సారధి (లీగల్) జనవరి 26: కర్నూలు నగరం పంచాలింగాల గ్రామ సమీపంలోని జిల్లా జైలులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలనుద్దేశించి ప్రసంగించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక అడ్వకేట్, ఒక ప్యారా లీగల్ వలంటీర్ ఉండే ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో ఖైదీలకు అవసరమైన న్యాయ సాయం చేస్తారని చెప్పారు. న్యాయవాదులను నియమించుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని కూడా నియమిస్తామని తెలిపారు. ఖైదీలు కరాగారంలో సత్రవర్తనతో మెలగాలని కోరారు. ఖైదీలకు వడ్డించే ఆహారాన్ని, నిత్యావసరాలను పరిశీలించి, వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలను వాయిదాలకు కచ్చితంగా హాజరయ్యేలా చూడాలని జైలు సిబ్బందిని ఆదేశించారు.
