సీమాంధ్ర సారధి(నంద్యాల): నంద్యాల(Nandyal) మండలం బిల్లల్లాపురం గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మధు శేఖర్ సచివాలయంలో ఆత్మహత్యాయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సచివాలయంలో బ్లేడుతో గొంతు, చేయి కోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడం గమనించిన తోటి సిబ్బంది వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. అయితే పని ఒత్తిడా? లేక వ్యక్తిగత సమస్యలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
