సీమాంధ్ర సారధి(కర్నూలు) జనవరి 31: రోడ్డు ప్రమాదాల పట్ల డ్రైవర్లకు అవగాహన ఉండాలని జిల్లా వైద్యాశాఖాధికారి భాస్కర్ అన్నారు. స్థానిక కొత్త బస్టాండ్లోని కర్నూలు-2 డిపో గ్యారేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రమాద రహిత డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రాంతీయ అధికారి టి.శ్రీనివాసులు, కర్నూలు-1 డిపో మేనేజరు సుధారాణి, కర్నూలు-2 డిపో మేనేజరు భూపాల్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు దీప్తి సుజన, డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజి సిబ్బంది పాల్గొన్నారు.
