ప్రసంగిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి
సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, ఫిబ్రవరి 24: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం మంగళవారం పంచలింగాలలోని కర్నూలు జిల్లా కారాగారాన్ని పరిశీలించిoది. బృందంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కామర్, జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఖైదీలకు వడ్డిస్తున్న భోజన నాణ్యత, బ్యారెకుల్లో శుభ్రత, జైలు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయాన్ని పొందడం, షూరిటీ లేని ఖైదీలకు వ్యక్తిగత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవగాహన కల్పించారు. అధికారులు స్వయంగా ఖైదీల భోజనాన్ని రుచి చూసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జైలు రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్‌ను తనిఖీ చేశారు.

కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రాధిక, జిల్లా అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ వరలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీడబ్యూ్డీ విజయరాజు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, జిల్లా ఇండస్ట్రీస్ ఆఫీసర్ అశోక్ కుమార్, డాక్టర్ మహేశ్వర ప్రసాద్, ఎ యల్యస్సీవో సురేంద్ర ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ సునీల్ రెడ్డి, జైలు అధికారులు, లీగల్ ఎయిడ్ న్యాయవాది సులోచన పాల్గొన్నారు.
