ప్రమాదం గురించి అడిగి తెలుసుకుంటున్న జడ్జి లీలా వెంకట శేషాద్రి
- న్యాయమూర్తి బి.లీలా వెంకట శేషాద్రి
సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, ఫిబ్రవరి 24: గాయపడిన విద్యార్థిని ఎస్. హీనాకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి.లీలా వెంకట శేషాద్రి వైద్యులను కోరారు. మంగళవారం కర్నూలులోని బండిమిట్ట ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న హీనాకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై ఉపాధ్యాయుల న్యాయమూర్తి విచారించారు. అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హీనా, ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాధవి నగర్ నారాయణ హైస్కూల్లో తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్ ఊడి లపై పడ్డ ఘటనపై అక్కడికి వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించారు. గాయపడిన సాయిచరణ్, సహచర విద్యార్థులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్కూలు యాజమాన్యానికి సూచించారు.
