ప్రసంగిస్తున్న జిల్లా జడ్జి జి.కబర్థి
సీమాంధ్ర సారధి (లీగల్) జనవరి 26: భారత రాజ్యాంగ ఫలాలు అందరి దరిచేరేందుకు న్యాయవాదులు కృషి చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి పిలుపునిచ్చారు. సోమవారం(జనవరి 26) కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కర్నూలు మొదటి అదనపు జడ్జి పీ.కమలాదేవి, 7వ అదనపు జడ్జి వి.లక్ష్మిరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి ఎం.శోభారాణి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.సరోజనమ్మ, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ జడ్జి ఎస్.అనిల్ కుమార్, స్పెషల్ మొబైల్ జడ్జి ఎస్.అనూష్, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఎం.బాలసుబ్రమణ్యం, స్పోర్ట్స్ సెక్రటరీ బెస్త సుధాకర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు జడ్జిలు బహుమతులు అందజేశారు.
