స్వామి అమ్మవార్లు..
సీమాంధ్ర సారధి, సికింద్రాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకొని ‘‘వేద సంకల్ప సంస్థ’’ సహకారంతో ‘దాన ధర్మ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ‘తెలంగాణలోని పలు దేవాలయాల్లో సీతారామ కళ్యాణోత్వాన్ని ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధి సిక్ విలేజ్‌లోని ఓ చిన్న ఆలయంలో దాన ధర్మ ట్రస్ట్ సభ్యులు కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అభిషేకం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పూజలో పాల్గొన్న ఐదు జంటలకు వస్త్రాలు అందజేశారు. సాయంత్రం నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


‘నిధుల లేమితో వేడుకలు నిర్వహించలేని ఆలయాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ‘‘వేద సంకల్ప సంస్థ’’ నిర్వహిస్తుంది. ప్రతి ఆలయానికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షలను దాతల నుంచి స్వీకరించారు. ఆ విరాళాలను స్వామి వారి కళ్యాణోత్సవానికి వినియోగించారు’ అని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

సిక్ విలేజ్ ఆలయంలో కళ్యాణోత్సవాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షుడు దుమ్మెన ప్రశాంత్‌ను వేద సంకల్ప సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.

మహాద్భాగ్యం..
‘రాముల వారి కళ్యాణోత్సవాన్ని ‘‘వేద సంకల్ప సంస్థ’’ సహకారంతో నిర్వహించడం సంతోషంగా ఉంది. దాన ధర్మ ట్రస్టు కూడా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు, పిల్లలకు ఆర్థిక సాయం చేస్తుంది. ఆలయాల్లో దూపదీప నైవేద్య నిర్వహణకు సహకరిస్తుంది.’ అని దుమ్మెన ప్రశాంత్ తెలిపారు.
దానధర్మ ట్రస్ట్ వెబ్సైట్.. Daanadharma.org
