సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, మార్చి 26: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి. లీలా వెంకట శేషాద్రి బుధవారం పంచలింగాలలోని జిల్లా జైలు, మహిళా జైళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీలకు వడ్డించే ఆహారాన్ని పరిశీలించారు. ఒక అడ్వకేట్, ఒక ప్యారా లీగల్ వలంటీర్ ఉండే లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా లాయర్‌ను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయం సహాయం అందుతుందని చెప్పారు. ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షా కాలన్ని పూర్తి చేయాలని సూచించారు. ఖైదీలను క్రమం తప్పకుండా కోర్టులకు హాజరు పర్చాలని జైలు సిబ్బందిని ఆదేశించారు. జడ్జి వెంట జైలు అధికారులు, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన ఉన్నారు.

