చిత్రకారుడు కోటేష్..
సీమాంధ్రసారధి, నంద్యాల, మార్చి26: శ్రీరామనవమిని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ మరోసారి తన ప్రతిభను చాటారు. మైక్రో పెన్ను, బ్రష్‌తో వాటర్ కలర్స్ వాడి చిన్న అగ్గిపెట్టె మీద రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చిత్రించారు.

ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ..
‘‘శ్రీరాముని జనన ఘట్టం నుంచి సీతాదేవి అగ్ని పరీక్ష ఘట్టం వరకు చిత్రంలో చూపాను. దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి.. వారి పిల్లలు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలను ముద్దాడుతున్నట్లు, విశ్వామిత్రుని దగ్గర రామలక్ష్మణుల శిష్యరికం, యజ్ఞాన్ని భంగం చేస్తున్న రాక్షసులను సంహారించిన రామలక్ష్మణులు, తండ్రి ఆశీస్సులతో వనవాసం వెళుతున్న సీతాసమేత రామ లక్ష్మణుడు, రామరావణ యుద్ధంలో రావణు సంహారం, సీతమ్మ అగ్ని ప్రవేశం.. ఇలా రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చిన్న అగ్గిపెట్టెపై మూడు గంటల్లో చిత్రీకరించాను. భక్తులందరికి రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ.. ప్రజలకు శ్రీరామనవమి
శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
