ప్రతీకాత్మక చిత్రం
సీమాంధ్ర సారధి(స్పోర్ట్స్): ‘ఖేలో ఇండియా పథకం’ కింద ఆంధ్రప్రదేశ్(A.P) రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో శ్రీకాకుళం జిల్లా పాత్రునివలసలో రూ. 14 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మల్లీపర్పస్ ఇండోర్ బ్లాక్ నిర్మించనున్నారు. కుప్పంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్(Sports) కాంప్లెక్స్‌లో రూ. 14 కోట్లుతో ఈ మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ నిర్మించనున్నారు. రాజమహేంద్రవరంలో రూ. 13.76 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. వీఐ పురంలో దీనిని నిర్మించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.9.50 కోట్లు కేటాయించారు. రూ. 6 కోట్లు ఖర్చు చేసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫుట్ బాల్ ఫీల్డ్ సిద్ధం చేయనున్నారు. ఒకటిన్నర కోటి ఖర్చు చేసి టెన్నిస్ కోర్టు, రూ. 92 లక్షలతో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 1.08 కోట్లు ఖర్చు చేసి 200 మీటర్ల ట్రాక్, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులకు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు.
