సీమాంధ్ర సారధి(గద్వాల): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజావీధిలో కొలువైన అంబాభవాని ఆలయంలో భావసార్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఝాడే మధుకర్ రావు, ఉపాధ్యక్షుడిగా సవారే సంతోష్ రావు, కార్యదర్శిగా సులాకే సిద్దేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా రాశంకర్ శ్రీనివాసరావు, ఝాడే జగదీశ్వర్ రావు, కోశాధికారిగా ఝాడే ప్రభాకర్, సలహాదారులుగా కాళిత్కర్ భవాని ప్రసాద్, ఝాడే శేఖర్ రావు, ఝాడే శివప్రసాద్ రావు, కాళిత్కర్ రమేశ్ రావు, రాంశంకర్ సత్యనారాయణరావుతో పాటు కార్యవర్గ సభ్యులుగా గుజ్జారే శ్రీనివాసరావు, ఝాడే కిరణ్ కుమార్, గడ్డాళే రాజారావు, గడ్డాళే వెంకటేశ్ రావు, రాశంకర్ లక్ష్మణ్ రావు, నీంకర్ బాలజీరావు, గుజ్జారే నరేందర్ రావు, సుత్రాయే ప్రవీణ్ రావు, సుదర్శన్ రావు, కాళిత్కర్ వీరేష్ బాబు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ రెండేళ్లు పదవిలో కొనసాగుతుందని అధ్యక్షుడు ఝాడే మధుకర్ రావు తెలిపారు.
