- లోక్ అదాలత్ జడ్జి బి.లీలా వెంకట శేషాద్రి
సీమాంధ్ర సారధి(కర్నూలు) జనవరి 31: దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉంటుంది. అయితే సమాజంలో ఇంకా అనేక మంది పిల్లలు విద్య, భద్రత, ప్రేమ, సంరక్షణకు దూరంగా వీధుల్లో జీవిస్తున్నారు. ఇలాంటి పిల్లలను వీధి బాలలు అంటారు. వీధి బాలల సమస్య సమాజానికి ఒక పెద్ద సవాల్‌గా మారింది. ఈ సమస్య నిర్మూలనపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది.

అందులో భాగంగా కర్నూలు(kurnool)లోని న్యాయసేవా సదన్‌లో వీధి బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడారు. వీధి బాలల నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా వీధి బాలలు కనిపిస్తే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 లేదా చైల్డ్ హెల్ లైన్ నెంబర్ 1098కు తెలపాని కోరారు. కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్, జాతీయ బాల శ్రమ ప్రాజెక్ట్, కర్నూలు, జిల్లా ప్రొబేషనరీ అధికారి, కౌన్సెలర్, సివిల్ సొసైటీ వారు, పోలీసు, జువెనైల్ సిబ్బంది పాల్గొన్నారు.
