సీమాంధ్ర సారధి(లీగల్): కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ రెగ్యులర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక శ్రీ ప్రసున లా కాలేజీలో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి లీల వెంకట శేషాద్రి తెలిపారు. అర్హులు, అనర్హుల జాబితాను డిస్టిక్ కోర్టు వెబ్సైట్ www.ecourtskurnool.com, https://kurnool.dcourts.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్లు రానివారు జిల్లా న్యాయ సేవా సదన్ కర్నూలులోని హెల్ప్‌డెస్క్‌ను 17వ తేదీన సంప్రదించాలని కోరారు. నియామక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందని, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రలోభాలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు.
