వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న రాఘవ రెడ్డి
సీమాంధ్ర సారధి, ఫిబ్రవరి 12: ఏపీలోని మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని భారత్ పెట్రోల్ బంక్ యజమాని బోధనపు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెట్రోల్ స్టేషన్ అడిటర్ బాన రాఘవ రెడ్డి వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మేడపి టోల్ గేట్ దగ్గర ఉన్న ‘‘విష్ణు వల్లభ ఫ్యూయల్ స్టేషన్ – భారత్ పెట్రోల్ పంపు’’ ప్రథమ వార్షికోస్తవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ ఐ క్యాంపులో మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ (నరసరావుపేట) చెందిన ప్రముఖ వైద్యులు రామలింగారెడ్డి సుమారు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెట్రోల్ స్టేషన్ మేనేజర్ చింతకుంట జీవన్ కుమార్, సిబ్బంది శివాజీ, చెన్నారెడ్డి, కుమార్, గణపవరం గ్రామపెద్దలు జి సత్యనారాయణ రెడ్డి చల్లా వెంకటరెడ్డి, కే. నాగయ్య, ఎ. హనుమంతరావు పాల్గొన్నారు.









