- నేడు కోర్టు విధులను బహిష్కరించనున్న న్యాయవాదులు
సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, ఫిబ్రవరి 22: న్యాయవాదులపై పోలీసు దాడులు అమానుషమని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో సర్వసభ్య అత్యవసర సమావేశం జరిగింది. దాడిని ఖండిస్తూ రేపు (23.2.25) కోర్టు విధులను బహిష్కరించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.కర్నూలు న్యాయవాది యం.పవన్ కుమార్‌పై దాడి చేసిన నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతుండడం ఆందోళనకరమన్నారు. న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులను అందరూ ఖండించాలని కోరారు.
