ది హాన్స్ ఫౌండేషన్ అధ్యాపక సిబ్బందితో NIEPID డైరెక్టర్ రామ్‌కుమార్
- మొబైల్ థెరపీ బస్సును ప్రారంభించిన NIEPID డైరెక్టర్ మేజర్ రామ్‌కుమార్
సీమాంధ్ర సారధి ప్రతినిధి, ఫిబ్రవరి 23: ‘‘ది హాన్స్ ఫౌండేషన్’’ విన్నూత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘థెరప్యూటిక్ సర్వీసెస్ ఆన్ వీల్స్’ (Therapeutic Services on Wheels) పేరిట దివ్యాంగుల ఇంటి వద్దనే వెళ్లి సేవలందించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బస్సును ఫిబ్రవరి 23వ తేదీన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ వర్సస్ విత్ ఇంటలెక్చువల్ డిస్అబిలిటీస్ (NIEPID) డైరెక్టర్ మేజర్ బి.వి రామ్‌కుమార్ ప్రారంభించారు. NIEPID సహకారంతో హాన్స్ ఫౌండేషన్ సమాజంలో పునరావాస సేవలను మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నో సేవలు..
ప్రాజెక్ట్ మేనేజర్ రీను పీటర్ మాట్లాడుతూ దివ్యాంగులకు మెరుగైన సేవలందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. దివ్యాంగులను గుర్తించడం, అవసరమైన చికిత్స, థెరపీలు ఇవ్వడం, వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ది హాన్స్ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు.
దివ్యాంగుల వద్దనే..
వీల్‌చైర్ ర్యాంప్ ఉన్న ఈ మొబైల్ థెరపీ బస్సు.. ప్రతి 15 రోజులకోసారి ముందస్తు సమాచారంతో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంది. ఫిజియోథెరపిస్టు, స్పీచ్ థెరపిస్టు, స్పెషల్ ఎడ్యుకేటర్, తదితర సిబ్బంది దివ్యాంగుల వద్దకు వెళ్లి సేవలందిస్తారు. అంతకంటే ముందు సైకలాజికల్ అసెస్మెంట్ చేస్తారు.
కార్యక్రమంలో దివిస్ ఫౌండేషన్ తరుపున శ్రీ జి. ప్రమోద్, NIEPID డిప్యూటీ డైరెక్టర్, సైకియాట్రిస్టు డాక్టర్ శ్రవణ్ రెడ్డి, NIEPID & ది హన్స్ ఫౌండేషన్ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
