సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, ఫిబ్రవరి 23: న్యాయవాది పవన్ కుమార్‌పై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ అనుచిత ప్రవర్తనలో న్యాయవాదులు ఖండించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ సోమవారం కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పవన్ కుమార్‌పై దాడి చేసిన విక్రమ్ సింహపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
