సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 24: ఎమ్మిగనూరు పట్టణానికి సమీపంలోని కలుగొట్ల రోడ్డు మార్గంలోని న్యూ ఎస్సీ కాలనీ ఆర్చి నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి ఎండార్స్మెంట్ కాపీని మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకుడు కదిరికోట ఆదెన్నకు అందజేశారు. త్వరలో రూ5.50 లక్షలతో ఆర్చి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల కలుగొట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఆర్చి నిర్మాణ విషయాన్ని ఆదెన్న తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
