నగదు అందజేస్తున్న కమిషనర్ గంగిరెడ్డి
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు, మార్చి10: పుట్టుకతో గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారికి ఎమ్మిగనూరు మున్సిపల్ సిబ్బంది ఆర్థిక సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ (PH) వర్కర్ సరోజమ్మ కొడుకు బసవరాజు గుండెలో రంధ్రం (Congenital Heart Defect) కారణంగా కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. శస్త్ర చికిత్స కోసం మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం, స్వర్ణ వార్డు సిబ్బంది స్వచ్ఛందంగా రూ. 80 వేల సమకూర్చారు. ఈ మొత్తాన్ని వారు కమిషనర్ ఎన్. గంగిరెడ్డి, ఇతర అధికారులు సమక్షంలో సరోజమ్మకు అందజేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికి కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన మున్సిపల్ అధికారులకు, తోటి సిబ్బందికి సరోజమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో DEE నీరజ, రాజు నాయక్, రెవెన్యూ ఆఫీసర్ (RO) అస్లాం బాషా, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, మేస్త్రి ఈరేష్, స్వర్ణ వార్డు అసోసియేషన్ ప్రతినిధులు గోవిందరాజులు, రవికిరణ్,లక్ష్మన్న, హంపిరెడ్డి పాల్గొన్నారు
