తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న కాలనీవాసులు
సీమాంధ్ర సారధి, కర్నూలు, మార్చి10: పందిపాడు ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. 2010లో ప్రభుత్వం పేదలకు ప్లాట్లు కేటాయించింది. పార్కుల నిర్మాణానికి కొన్ని చోట్ల స్థలాలను వదిలింది. అయితే ప్రస్తుతం కాలనీలో భూములకు మంచి డిమాండ్ ఉండడంతో కొంతమంది పార్కు స్థలాలను, ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించి, ప్లాట్లు వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఇదే విషయాన్ని కాలనీ వాసులు రాము, శేఖర్ రెడ్డి, అన్వర్ బాష, శేఖర్ రెడ్డి, మౌలాలి, శ్రీదేవి, ప్రసాద్, నాగరాజు మంగళవారం కల్లూరు తహసీల్దార్ కె. ఆంజనేయులు, ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహను కలిసి ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమణదారుల నుంచి కాపాడాలని కోరారు. విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.
