వెంకటసుజాత, ఈరమ్మ, రజిత
సీమాంధ్ర సారధి, కర్నూలు: భారతీయ జనతా పార్టీ(BJP) అనుబంధ సంస్థ మహిళా మోర్చా నూతన కార్యవర్గ ఎన్నిక ఇటీవల జరిగింది. కర్నూలు బుధవారపేటలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఎ. వెంకట సుజాత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలుగా జె. ఈశ్వరమ్మ (పాణ్యం), వై. కరుణమ్మ (కోడుమూరు), పి. రజిత (కోడుమూరు), కె. పద్మావతి (ఎమ్మిగనూరు), ప్రధాన కార్యదర్శిగా బి. ఈరమ్మ (పాణ్యం), కార్యదర్శులుగా జయ సంగీత (కర్నూలు), ఎం. సుజాత (కర్నూలు), వి. మంజుల శ్రావణి (ఆలూరు), ఎస్. రాజేశ్వరి (కోడుమూరు), కోశాధికారిగా ఎన్. పద్మ(పాణ్యం), సోషల్ మీడియా ఇన్చార్జిగా మధు సంగీత (పాణ్యం) ఎన్నికయ్యారు. త్వరలో మరికొంతమంది సభ్యులను ఎన్నుకోనున్నట్లు సుజాత తెలిపారు. కార్యవర్గ పదవీ కాలం మూడేళ్లు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

‘అమ్మ టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా చేశారు..’
తన కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి సుజాత చెప్పుకొచ్చారు. ‘‘2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. తొలుత తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేశా. బూత్ కమిటీ మెంబర్‌గా కూడా ఉన్నాను. ఐదేళ్ల పాటు అదే పార్టీలో కొనసాగా. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. నాలుగేళ్లు సేవాదళ్ జిల్లా అధ్యక్షులిగా కొనసాగా. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కర్నూలుకు రావడంతో ఆయన సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యా. ఇకపోతే మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. మా నాన్న పేరు బలరామయ్య. అమ్మ ఎన్ లక్ష్మీదేవమ్మ. కర్నూలులో టీడీపీలో జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశారు. మా తాతగారి పేరు బండ నాగప్ప. అనంతపురం జిల్లా తాడిప్రతి మండలం గోరుమాన్పల్లె సర్పంచ్‌గా పనిచేశారు. నా భర్త మహేంద్ర కుమార్, వ్యాపారవేత్త.’’ అని వివరించారు వెంకటసుజాత.



