సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 24: ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి వాటిని ప్రైవేటు సంస్థ పినాకిల్కు అప్పజెప్పడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని NMUA డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ ఆరోపించారు. వాటిని ప్రభుత్వమే కొని నడపాలని కోరారు. ఈ మేరకు మంగళవారం డిపో ముందు యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో డిపో చైర్మన్ ఎన్పీ ఎం సాహెబ్, రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ సురేష్ బాబు, డీఎం బాషా, ఏ.మంజుల, వై. నీలకంఠ, ఎన్డీగిరి, ఎంఎల్ రెడ్డి, బజారప్ప, తిమ్మప్ప ,బాలరాజు, మునిస్వామి, ప్రసాద్, ఓంకార్, శ్రీనివాసులు, కేఏ అలీ పాల్గొన్నారు.
