సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 24: పరిశ్రమల పట్ల విద్యార్థులకు అవగాహన ఉండాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీవర్స్ కాలనీ ప్రధానోపాధ్యాయులు బి నాగభూషణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9, 10 తరగతి విద్యార్థులను ఇండస్ట్రియల్ విజిట్ కోసం మహబూబ్ ఆటో ఎలక్ట్రికల్ వర్క్ సెంటర్కు తీసుకువెళ్లారు. వారికి సెంటర్ నిర్వాహకుడు మహబూబ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, మోటార్స్, బ్యాటరీస్, గ్రావిటీ చెకింగ్, వైరింగ్, ఎర్తింగ్ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఒకేషనల్ ఉపాధ్యాయురాలు వి వెంకటలక్ష్మి, ఈరన్న, శ్యామ్, వంశీ పాల్గొన్నారు.
