సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( వీవర్స్ కాలనీ) వృత్తి విద్య విద్యార్థులను గురువారం(ఫిబ్రవరి 26) ఇండస్ట్రియల్ విజిట్‌కు తీసుకెళ్లారు. స్థానిక బజాజ్ శ్రీ హారిక ఆటోమోటివ్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ విధానం, ఇంజిన్ డయాగ్నోసిస్, లూబ్రికేషన్ సిస్టమ్, బ్రేక్ సిస్టమ్ పనితీరుతో పాటు ఆధునిక పరికరాల వినియోగంపై చక్కగా అవగాహన కల్పించారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలు ఫీల్డ్ విజిట్ ద్వారా విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంటాయని ప్రధానోపాధ్యాయులు నాగభూషణ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ఈరన్న, సుధాకర్, సిబ్బంది సభ్యులు శ్రీహరి, నాగరాజు, శ్యామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వీస్ సెంటర్ నిర్వాహకులకు పాఠశాల తరఫున నాగభూషణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
