సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు: తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు పాత ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. కనీస వేతనం రూ. 26వేలు, గ్రాట్యూటీ, 30 రోజులు ఎండాకాలం సెలవులు ఇవ్వాలని ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు రిలే దీక్షలు చేశారు. ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలిచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రాముడు ఆరోపించారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి నాయకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 27న డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
