సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు: తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మార్చి 2న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి బి గోవర్ధనమ్మ సీఐటీయూ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు పీ గోవిందు, బీ రాముడు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల శ్రమను ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. కనీస వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కారిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిన్నర గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. రిలే దీక్షలకు యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మల్లారి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మన్న, సుధాకర్ మద్దతు పలికారు. దీక్షలో నాగలక్ష్మి, వమణి, మల్లేశ్వరి, అరుణ, నీరజ, నాగలక్ష్మి, లత, భాగ్యమ్మ, లక్ష్మీదేవి, కృష్ణవేణి పాల్గొన్నారు.
