కరపత్రాలను ప్రదర్శిస్తున్న ఆశావర్కర్లు
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు: ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివలక్ష్మి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రాముడు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్లో కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం శివలక్ష్మి, రాముడు మాట్లాడుతూ ఆశ వర్కర్లు చాలా ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నా, వారికి చట్టబద్ధంగా సెలవులు, మెడికల్ లీవ్‌లు ఇవ్వడం లేదన్నారు. సర్వే పనులు చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. కనీస వేతనంగా రూ 26వేలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు విశాలాక్షి, నాగలక్ష్మి, సారమ్మ, లింగమ్మ, రంగ లక్ష్మి, నాగలక్ష్మి, సంతోషమ్మ, గిరిజ, వీరేషమ్మ, హాజీవి పాల్గొన్నారు
