నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు మార్చి 3: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాడుతున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ, బేబీ రాణిలను మంగళవారం (మార్చి 3వ తేదీ) పోలీసులు విజయవాడలో అరెస్టు చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మిగనూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎండీవో కార్యాలయం దగ్గర నుంచి సోమప్ప సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, మెయిన్ బజార్లో ర్యాలీ నిర్వహించారు. అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు గోవిందు, రాముడు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తాలూకా కమిటీ కార్యదర్శి బి. గోవర్ధనమ్మ, నాయకులు నీరజ, మల్లేశ్వరి, నాగ శిరోమణి డిమాండ్ చేశారు. వేతనపెంపు, గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీలు గత కొన్ని రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.
