సీమాంధ్ర సారధి, కర్నూలు, మార్చి10: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర స్థాయి వ్యాసరచన పోటీలు, జాతీయస్థాయి క్విజ్ పోటీలను 13వ తేదీ ఉదయం 11 గంటలకు నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, యునైటెడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ చైర్మన్, నైస్ స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, యునైటెడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

10 నుంచి 15 సంవత్సరాలు లోపు వారిని జూనియర్స్గా, 15 సంవత్సరాలు పైబడిన వారిని సీనియర్స్గా పరిగణించి పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను 12వ తేదీలోగా వెంకటరమణ కాలనీ మొదట లైన్లోని నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో లేదా 9396861308 నెంబర్ సంప్రదించి పేరు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
