సీమాంధ్రసారధి, కర్నూలు, మార్చి 11: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ‘కుటుంబ సంక్షేమం’పై నవ దంపతులకు, గర్భిణులకు అవగాహన కల్పించారు. కర్నూలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయగౌరీ ఆదేశాల మేరకు బుధవార పేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాలిచ్చే తల్లులు, గర్భిణులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి కొన్ని ప్రశ్నలడిగి, సరైన సమాధానం చెప్పిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో EO రాజేశ్వరి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ స్వర్ణలత, జోష్నా ప్రియాంక, డీఎల్ఎస్ఏ మెంబర్ రాయపాటి శ్రీనివాసులు, సచివాలయ నర్సు అరుణ, అంగన్వాడీ వర్కర్స్ లక్ష్మీ దేవి, రాజేశ్వరమ్మ పాల్గొన్నారు.

