సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు మార్చి 11: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్, జిల్లా కమిటీ సభ్యులు గోవిందు, రాముడు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కార్యవర్గ సమావేశం బుధవారం ఎమ్మిగనూరులో జరిగింది. తమను గెలిపిస్తే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేస్తామని, 50 ఏళ్లుదాటిన డ్రైవర్లకు పింఛన్లు ఇస్తామని హామీలు గుప్పించారని, పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆ ఊసేలేదన్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. సమావేశంలో ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు మోహన్ దాస్, రాఘవేంద్ర, కేసన్న, అబ్రహం మహబూబ్ బాషా, ప్రకాష్, రాముడు, రవికుమార్ పాల్గొన్నారు.
