కరపత్రాలను విడుదల చేస్తున్న రాజారెడ్డి
సీమాంధ్ర సారధి, బనగానపల్లె, మార్చి 12: ఉగాది పండుగ సందర్భంగా శ్రీ అరుణ భారతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ‘ఘంటసాల గాన కచేరి’ ఏర్పాటు చేస్తున్నామని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి తెలిపారు. కార్యక్రమ కరపత్రాలను ఆయన గురువారం విడుదల చేశారు. ఈనెల 15వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు బీసీ గుర్రెడ్డి కాలనీలోని ప్రియదర్శిని స్కూల్ ఎదురుగా కచేరి ఉంటుందని చెప్పారు. లండన్ స్పిరిట్ ఆఫ్ ఘంటసాల అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ సినీ గాయకులు డి.ఎ.మిత్ర బృందం(హైదరాబాద్)తో పాటు ప్రముఖ గాయని జ్యోతి, గాయకుడు హబీబ్ కూడా విచ్చేస్తున్నారని చెప్పారు. నెహ్రూ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించనున్నాయన్నారు. కార్యక్రమంలో అరుణ భారతి సాంస్కృతిక సంస్థ సభ్యులు బొబ్బల మహేశ్వరరెడ్డి, బలరామయ్య, జ్యోతిష్యం వెంకట్రాముడు, భరతుడు, చంద్రమౌళీశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, టిఎన్ఆర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
