సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు, మార్చి12: పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపాల్ నాగరాజు ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఐదో తరగతి పూర్తిచేసుకుని ఆరో తరగతికి వెళ్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశామని జెడ్ఈవో మాచాని కవిత తెలిపారు. పిల్లలను పైతరగతులకు వెళ్ళటానికి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం అనురాధ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

