సీమాంధ్ర సారధి, జగిత్యాల, మార్చి13: ధన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 20 మంది పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు వెంకట్, సూర్యకు, అలాగే ధన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు దుమ్మెన ప్రశాంత్కు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించామని ప్రశాంత్ తెలిపారు. కార్తీక మాసంలో గ్రామ దేవాలయాలకు నిత్య దీపారాధన కోసం పూజా సామగ్రి, సామూహిక వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలకు చీరలు, దీపావళి సందర్భంగా గ్రామ దేవాలయాల్లో దీపోత్సవాలు అవసరమైన సామగ్రిని సమకూర్చిందని ఆయన చెప్పారు.

