పోస్టర్లను విడుదల చేస్తున్న జేసీ నూరుల్ ఖమర్
సీమాంధ్ర సారధి, కర్నూలు, మార్చి13: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన పోస్టర్లను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్న వస్తువుల్లో నాణ్యత లోపిస్తే ప్రశ్నించే హక్కు ప్రతి కొనుగోలుదారుడికి ఉంటుందన్నారు. అందుకు ఉన్న చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి రఘువీర్ మాట్లాడుతూ తప్పుడు ప్రకటనలు, నకిలీ ఉత్పత్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోలు సమయంలో బిల్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నాణ్యత గుర్తు ఉన్న వస్తువులు మాత్రమే కొనాలని చెప్పారు.
లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, యునైటెడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడారు. వినియోగదారులు తమ హక్కులను తెలుసుకొని మోసపోకుండా ఉండాలని కోరారు. అనంతరం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచనపోటీలలో గెలుపొందిన ఎండీ. అతీక్ అహ్మద్‌కు జాయింట్ కలెక్టర్ మెమెంటో, సర్టిఫికెట్ అందజేశారు.

జాయింట్ కలెక్టర్
