కార్యక్రమంలో మాట్లాడుతున్న బుట్టా రేణుక
- భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు: బుట్టా రేణుక
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు, మార్చి 13: బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణం వెంకటాపురం రోడ్లో ఏర్పాటు చేసిన గార్మెంట్స్ యూనిట్‌ను కర్నూలు మాజీ ఎంపీ, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక చేయూతనందించేందుకు ఈ యూనిట్‌ను ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో గార్మెంట్స్ యూనిట్ మేనేజర్ ఉషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




ఉచిత శిక్షణ..
ఉచిత శిక్షణ గురించి ట్రైనర్ ఉషా మాట్లాడుతూ..‘‘యూనిఫామ్స్, జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగ్స్, ఎంబ్రాయిడరీ నేర్పిస్తా. కోర్సును బట్టి కాల పరిమితి ఉంటుంది. ఒక్కో బ్యాచ్‌లో సుమారు 30 మంది మహిళలు ఉంటారు. 18 నుంచి 40 ఏళ్ల లోపు మహిళలు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు ఫొటోతో వచ్చి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ అనంతరం మా వద్ద పనిచేసే వారికి గౌరవ వేతనంగా రూ. రూ,6,500 – రూ. 7,000 ఇస్తాం. కొత్త బ్యాచ్‌లు జూలై నుంచి ప్రారంభమవుతాయి. మహిళలు స్వయం ఉపాధితో రాణించాలన్నదే బుట్టా ఫౌండేషన్ ముఖ్యోద్దేశం.
– శిక్షకురాలు ఉషా
