సీమాంధ్ర సారధి, కర్నూలు, మార్చి 14: కర్నూలు- కడప కెనాల్ (KC Canal) హైదరాబాదు మూసీ నదిని తలపిస్తోందని డీవైఎఫ్ఐ మాజీ నాయకుడు సీహెచ్ సాయిబాబా, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు ఎండీ యునూస్, ఇరిగినేని పుల్లారెడ్డి, సమీప కాలనీల ప్రతినిధులు కే వెంకటేశ్వర్లు, ఎండీ గౌస్ అన్నారు. చెత్తాచెదారంతో నిండిపోయి ప్రజల ఆరోగ్యానికి హానికరంగా తయారైనా..అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.

శనివారం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కేసీ కెనాల్‌ను పరిశీలించింది. ఏటా తాత్కాలికంగా చెత్త తొలిగించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. కెనాల్ శుభ్రతకు వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు ఇరువైపులా ఇనుప కంచ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్లో వ్యర్థాలను వేయవద్దని, అలా చేయడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలను అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చిత్తారు వెంకట వర్మ, ఎండీ శంసుద్దీన్, ఎస్ రమణ గౌడ్, ఎస్ మాలిక్ బాషా, కే రామకృష్ణ పాల్గొన్నారు.

