కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి కబర్థి
- కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్థి
సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, మార్చి 14: జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40,921 కేసులు పరిష్కారం అయ్యాయిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి, మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరో అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడో అదనపు జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి అనూష, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మినరసింహారెడ్డి పాల్గొన్నారు. 186 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.12 లక్షలను బాధితులకు బీమా కంపెనీల ఇప్పించామని జిల్లా జడ్జి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 190 మంది రైతుల వారసులకు రూ.83 లక్షలను నష్టపరిహారంగా ఇప్పించామన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ మొత్తం రెండు జిల్లాల్లో 25 బెంచీలను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు, 40232 క్రిమినల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమలో కోర్టు మానిటరింగ్ సీఐ రామానాయుడు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

