సీమాంధ్ర సారధి, కర్నూలు లీగల్, మార్చి 24: కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘానికి మార్చి 30వ తేది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలైంది. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు.

ఎవరు ఏ పదవికి?
అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాదులు బి.మురళి మోహన్, బి.చంద్రుడు, ఉపాధ్యక్ష పదవికి బి.మద్దిలేటి, జే.రసూల్ ఖాన్, ప్రధాన కార్యదర్శి పదవికి జి.నాగమణి, టి.మహేశ్వర రెడ్డి, కే.నాగరాజు, వై. సోమశేఖర్, ఎం.వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి పదవికి ఈ.ఆర్. సాయి ప్రదీప్, ఎస్.జహంగీర్ బాష, సాంస్కృతిక, క్రీడాల శాఖ కార్యదర్శికి బెస్త సుధాకర్, బంగి సుధీర్, కె.ప్రభాకర్, ఇ. సురేంద్ర గౌడు, కోశాధికారి పదవికి సుమన, గ్రంథాలయ కార్యదర్శి పదవికి ఎండి.మహేష్ కుమార్, మహిళా ప్రతినిధికి ఆర్.కరుణ జ్యోతి నామినేషన్లు దఖాలు చేశారు.

ముగ్గురు ఏకగ్రీవం..
అయితే ముగ్గురు మాత్రం ఏకగీవ్రంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి ప్రభాకర్ తెలిపారు. వారిలో కోశాధికారిగా సుమన, గ్రంథాలయ కార్యదర్శిగా ఎండి.మహేష్ కుమార్, మహిళా ప్రతినిధిగా ఆర్.కరుణ జ్యోతి ఉన్నారు.

