అవగాహన కల్పిస్తున్న రాజేష్
సీమాంధ్ర సారధి, హైదరాబాద్ మార్చి 25: ప్రతి మనిషి తన జీవితకాలంలో ఎంతో కొంత స్థిరచరాస్తులను కూడబెట్టడం సహజం. మరణానంతరం వాటి పంపకాల్లో పిల్లల మధ్య ఆర్థికపర విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, తమ సంతానంలో ఎవరికి ఏ ఆస్తి ఇవ్వాలన్నది స్పష్టంగా కనపరుస్తూ కొంతమంది వీలునామా రాస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల వీలునామా చెల్లకుండే పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

అయితే వీలునామా రాసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రముఖ న్యాయవాది వాల్మీకి రాజేష్ బోయ 60 ఏళ్లు పైబడిన వారికి అవగాహన కల్పించారు. వివేకానందపురం సీనియర్ సిటిజెన్ అసోసియేషన్, నేరెడ్మెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో గిఫ్ట్‌డీడ్ రాయడం గురించి, అలాగే ఆస్తి పంపకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీనియర్ సిటిజన్లకు వివరించారు. కొందరి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో వివేకానందపురం సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.యస్. మూర్తి, మాతృపురి కాలనీ అధ్యక్షుడు సుబ్రమణ్యం, రాఘవేంద్ర నగర్ కాలనీ అధ్యక్షుడు ఫణి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

