రాజీవ్ రెడ్డికి గ్రామకమిటీ నివేదికను అందజేస్తున్న నాయకులు
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు: పార్టీ బలోపేతంలో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాటు కొనసాగుతోంది. ఇందులో భాగంగా 27 వార్డ్ కమిటీని పూర్తిచేసి అధికారికంగా వైసీపీ ఎమ్మిగనూరు(Yemmiganur) ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డికి వార్డు కమిటీ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు శ్రీధర్ రెడ్డి, ఆర్ నర్సిరెడ్డి, బాబా ఖాన్ పాల్గొన్నారు.
గ్రామ కమిటీలు ఎందుకు?
వైసీపీ(YCP) గ్రామ కమిటీ ఏర్పాటు వెనక ప్రధాన ఉద్దేశ్యం పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడం. ఎన్నికలు ఉన్నా లేకపోయినా, ప్రతి గ్రామంలో కార్యాచరణకు ఇది నిర్మాణాత్మక వ్యవస్థ. అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, లబ్ధిదారులతో నేరుగా సంబంధాలు కొనసాగించడం, గ్రామ సమస్యలను గుర్తించి పార్టీ నేతల దృష్టిలో తీసుకెళ్లడం, భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా ఓటర్లతో నిరంతర సంబంధం కొనసాగించడం ఇందులో ప్రధానాంశాలు.
