అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులు
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు : నందవరం(Nandavaram) మండలకేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రెండు సెంట్ల స్థలం కేటాయించాలని బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. స్థలం కేటాయింపు విషయంలో రాజకీయ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ రామన్న గౌడు, బీజేపీ(BJP) ఎస్సీ మోర్చా మండల మాజీ అద్యక్షుడు కె శివ, డానియల్, బి ప్రభాకర్, చాకలి హనుమన్న, బీజేపీ మైనార్టీ నాయకులు అబ్దుల్, సుభాన్, షబ్బీర్, మినల్ల, జయరాజు, విక్టర్, స్కూలు చైర్మన్ పి శివ, సొషల్ మీడియా కన్వీనర్ దండు వీరేష్ పాల్గొన్నారు.
