సోమప్ప సర్కిల్లో ధర్నా చేస్తున్న సీపీఎం, కేవీపీఎస్ నాయకులు
సీమాంధ్ర సారధి, ఎమ్మిగనూరు మార్చి 9: పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి గోవిందు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం, కేవీపీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సోమప్ప సర్కిల్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా గోవిందు మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. వాణిజ్య అవసరాల సిలిండర్‌పై రూ. 115 పెంచడం దుర్మార్గమన్నారు. గ్యాస్ కొరత మన దేశానికి లేదని చెబుతున్న ప్రధాని మోదీ మరి ఎందుకు ధరలు పెంచాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర పెంపుపై కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ధరల తగ్గించకపోతే పోరాటాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి తిమ్మన్న, నాయకులు సుమాల రాజు, సోగనూరు రాముడు, గంగన్న, కుమార్, కిరణ్ బాబు, సీపీఎం నాయకులు రాముడు, సురేష్, లక్ష్మీ నరసయ్య అబ్దుల్లా, రవి, సుభాన్, శీను, చర్మ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల అంథోని పాల్గొన్నారు.
